దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర రూపం దాల్చుతోంది. సామాన్య జ‌నంతోపాటు కొవిడ్ వారియ‌ర్స్ కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా ఏకంగా 55మంది పోలీసులు క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక తమిళనాడులో మంగళవారం కొత్తగా 601 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,448కి చేరింది. ఇక ఇప్పటివరకు తమిళనాడులో 84 కరోనా మరణాలు సంభవించాయి. మరో 7,466 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లో కూడా మంగళవారం కొత్తగా 136 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి బెంగాల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2,961కి చేరింది. 178 మరణాలు సంభవించాయి.

 

ఇక‌ గుజరాత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రానికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 395 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 12 వేల మార్కు దాటి 12,141కి చేరింది. కాగా మొత్తం కేసులలో 719 మంది మరణించగా మరో 5,043 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గుజరాత్‌ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అలాగే.. జమ్మూకశ్మీర్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 28 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 22 కేసులు కశ్మీర్ డివిజన్ లో నమోదు కాగా..6 కేసులు జమ్మూ డివిజన్ లో నమోదయ్యాయి. ఇవాళ్టి కేసులతో మొత్తం పాజిటివ్ కేసులు 1317కు చేరుకుంది. వీటిలో 653 యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: