తెలంగాణ లో లాక్ డౌన్ సడలింపులు  చేసినప్పుడు నుంచి రోజురోజుకు నమోదవుతున్న  కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్  సడలింపు లకి ముందు అతి తక్కువగా నమోదైన కేసులు  ప్రస్తుతం భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 40 కి తగ్గకుండా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా మంగళవారంనాడు మరో 42 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని కొత్తగా ముప్పై నాలుగు కేసులు నమోదు చేయడం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. 

 

 మరో 8 కొత్త కేసులు వలసదారులకు సంబంధించినవిగా గుర్తించారు అధికారులు. కాగా  ఇప్పుడు వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1634 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు 1011 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం యాక్టివ్  ఉన్న కేసుల సంఖ్య 585. అయితే ఈ మొత్తం కేసులలో ఏకంగా 75 మంది వలసదారులు ఉండడం గమనార్హం. మంగళవారం ఒకేరోజు ఈ మహమ్మారి వైరస్ వారి నుంచి 9 మంది  కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: