టాలీవుడ్ యంగ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ద‌ర్శ‌కుడు శ్రీ‌నువైట్ల శుభాకాంక్ష‌లు తెలిపారు. *మీరు అద్భుతమైన నటుడు. మీది గొప్ప మ‌న‌స్సు. బాద్‌షా సమయంలో మీరు కేటాయించిన‌ సమయానికి ధన్యవాదాలు. ఇది ఎల్లప్పుడూ న‌న్ను మీకు దగ్గరగా ఉంచుతుంది* అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. అంత‌కుముందు క‌ళ్యాణ్‌రామం, త‌దిత‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈరోజు ఆయ‌న‌ జ‌న్మ‌దినం కావడంతో వారం రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో అభిమానుల‌ సందడి మొదలైంది. ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతోపాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

ఈ సంఖ్య చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. జూనియర్ జూనియర్ ఎన్టీఆర్‌కున్న‌ ఇమేజ్ సత్తా ఏమిటో తెలుస్తుంది. కేవలం నిన్న‌ ఒక గంట 17 నిమిషాల్లోనే 3.5 మిలియ‌న్ పోస్ట్‌లు వచ్చాయంటే జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌, కోలీవుడ్ బాలీవుడ్‌ స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, టెక్నీషియన్లు, అభిమానులు.. ఇలా అన్ని వర్గాల నుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇది జూనియ‌ర్ ఎన్టీఆర్ సృష్టించిన స‌రికొత్త రికార్డు అని అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: