విశాఖలో దారుణం జరిగింది. 5 వేల కోసం స్నేహితుడ్ని చెట్టుకి కట్టేసి కొట్టారు కొందరు యువకులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. టూ వీలర్ కొని డబ్బులు చెల్లించలేదు అని ఒక యువకుడ్ని చెట్టుకి కట్టేశారు కొందరు స్నేహితులు. 

 

తమ దగ్గర బండి కొన్నావ్ అని ఇంకెప్పుడు డబ్బులు చేల్లిస్తావ్ అని అతన్ని నలుగురు యువకులు చెట్టుకి చేతులు కాళ్ళు కట్టేసి హింసించారు. మెడలో తాడు వేసి లాగారు. ఈ ఘటనను అక్కడ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది వైరల్ గా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: