టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అతనికి విష్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు అతనికి విష్ చేసారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు. మా తారక్ కి జన్మదిన శుభాకాంక్షలు. 

 

అద్భుతమైన నటన, అభినయం తో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావు. #RRR చిత్రంతో కొమరం భీమ్ గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమ్రోగాలని ఆశిస్తున్నాను అని ఆయన ట్వీట్ చేసారు. ఇక నందమూరి కుటుంబానికి రాఘవేంద్ర రావు కి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలను ఆయన తీసారు. అడవి రాముడు సినిమా సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: