నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  ఈ నేపథ్యంలో  హ్యాపీ బర్త్‌ డే భీమ్‌.. తారక్‌.. నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నాను' అని చిరంజీవి ట్వీట్ చేశారు. పేర్కొన్నారు. 'హ్యాపీ బర్త్ డే నాన్నా' అంటూ నందమూరి కల్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు.  'మా ఎన్టీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో కొమరం భీమ్ గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమోగాలని ఆశిస్తున్నాను' అంటూ దర్శకుడు రాఘవేంద్ర రావు ట్విట్ చేశారు. 

 

 

ఇక మొదటి సారిగా బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ 1 కి హూస్ట్ గా వ్యవహరించారు ఎన్టీఆర్.  ఈ సందర్బంగా ఆయనకు తెలుగు బిగ్‌బాస్‌-1 హౌస్‌మేట్స్‌ ఆయనకు ఓ వీడియో రూపంలో శుభాకాంక్షలు చెప్పారు. దీన్ని సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.  ఈ సందర్బంగా బిగ్‌బాస్‌1 లోని హౌస్‌మేట్స్‌ అందరూ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో గతంలో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకున్నారు.  అంతే కాదు రాజకీయ నేతలు ఎన్టీఆర్‌కు టీడీపీ నేతలు నారా లోకేశ్, గంటా శ్రీనివాసరావు, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 

 

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ లో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.  అయితే ఉగాదికి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.. అలాగే చరణ్ పుట్టిన రోజు సందర్బంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఎన్టీఆర్ కి అలాగే ప్లాన్ చేయాలనుకున్నా ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో అది కుదరలేదని ఎన్టీఆర్ స్వయంగా తెలిపారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: