ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి బస్సులు రేపటి నుంచి రోడ్ల మీదకు రానున్నాయి. పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. 50 రోజుల నుంచి డిపో లకు మాత్రమే పరిమితం అయిన ఆర్టీసి బస్సులు, ఇప్పుడు బయటకు రావడానికి సిద్దమవుతున్నాయి. బస్సులను అధికారులు పూర్తి స్థాయిలో సిద్దం చేస్తున్నారు. 

 

సాయంత్రం 7 గంటల లోపు బస్సులు డిపోలకు చేరుకుంటాయి. అదే విధంగా బస్సుల్లో సామాజిక దూరం మాస్క్ లు అనేవి కచ్చితంగా కావాలి. నేటి సాయంత్రం నుంచి ఆన్లైన్ రిజర్వేషన్ లు ఉంటాయి. బస్సుల్లో టికెట్ లు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు చెప్తున్నారు. వేరే రాష్ట్రాలకు బస్సులను నడిపేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: