కరోనా వైరస్ పై పోరాటంలో వైద్యుల పాత్ర గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. వాళ్ళు పడే కష్టాన్ని ఏ విధంగా చెప్పినా తక్కువే. వాళ్ళను ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా దేశాలు ఇప్పుడు వాళ్ళను కనపడే దేవుళ్ళు అని అంటున్నారు అంటే వాళ్ళను ఏ విధంగా కీర్తిస్తున్నారు అనేది అర్ధమవుతుంది. 

 

అయితే బెల్జియం లో మాత్రం వైద్యులను ఏ విధంగా పట్టించుకోవడం లేదు. వాళ్లకు బడ్జెట్ లో కూడా కోత విధించారు. ఆ దేశంలో 55 వేలకు పైగా కేసులు 9 వేలకు పైగా మరణాలు ఉన్నాయి. అయినా సరే బడ్జెట్ లో వైద్యులకు పెద్ద పీట వేయలేదు. ఇక వారి వేతనాల్లో కూడా కోత విధించడం తో ప్రధాని వెళ్ళే సమయంలో వైద్యులు రోడ్డు మీద వీపు వెనక్కు తిప్పి నిరసన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: