మరో ఒకటి రెండేళ్ళు కరోనా తో బ్రతకాలని తెలంగాణా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెడితే కేంద్రం అప్పులు ఇస్తుంది అంటూ ఆయన మండిపడ్డారు. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులను ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అక్కడ కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని అన్నారు. 

 

బిజెపి ఇచ్చింది ఒక పనికి రాని ప్యాకేజి అని ఆయన మండిపడ్డారు. ఆదుకోవాల్సిన సమయంలో అక్కరకు రాని ప్యాకేజి ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేద్దామని రైతులకు ఆయన పిలుపు ఇచ్చారు. రైతులను తెలంగాణా సర్కార్ ధనవంతులను చేస్తుంది అంటూ ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజి పై తెరాస మండిపడుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: