దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుంచి దేశంలో ప్రతిరోజూ 5000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా కొంతమంది ప్రజలు మాత్రం వైరస్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా కొందరు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు. 
 
అందువల్ల పలు దేశాలు మాస్క్ లు ధరించని వారికి భారీ జరిమానాలు విధిస్తున్నాయి. దుబాయ్ ప్ర‌భుత్వం బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ ధ‌రించ‌కుంటే 3,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీ ప్రకారం 60,000 రూపాయలు) జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది. క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే 10 లక్ష‌లు, ప‌లుమార్లు ఉల్లంఘిస్తే 20 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తామ‌ని ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: