IHG

మే 20 న టాలీవుడ్ స్టార్ హీరోస్ అయినటువంటి మంచు మనోజ్, jr ఎన్టీఆర్ ల బర్త్ డే జరుపుకోవడం సినీ అభిమానులకు సంబరం గా మారింది. అదికూడా ఈ ఇద్దరు హీరోల బర్త్ డే కావడం తో జూనియర్ అభిమానులు మనోజ్ కి ..మనోజ్ అభిమానులు జూనియర్ కి విషెస్ చెప్పుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా పలువురు సినీ తారలు తారక్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అదేవిధంగా మంచు మనోజ్ కి కూడా బర్త్ డే విషెష్ తెలియజేసారు. అయితే మనోజ్ చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి నారతోహిత్ మనోజ్ కి విష్ తెలుపుతూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు...నారారోహిత్ ట్వీట్ చేస్తూ ...చిన్నప్పటినుండి నేను నిన్ను గమనిస్తున్నాను ..ని లైఫ్ స్టైల్ ని నేను చాల ఇష్టపడతాను...నీవేల జీవించాలనుకుంటున్నావో ఆలా పరిపూర్ణంగా జీవించు..హ్యాపీ బర్త్ డే  టు యు ...అంటూ ట్వీట్ చేశాడు.

 

 

మంచు మనోజ్ గత గుద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా ప్రస్తుతం అహం బ్రిహ్మం సినిమాతో బిజీ గా ఉన్నాడు. నారా రోహిత్ కూడా ఓ నాలుగు సినిమాలతో అలరించనున్నాడు. అయితే ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు ఈ సంవత్సరం బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు అని అడుగగా కరోనా వచ్చి ప్రపంచం తలక్రిందులవుతున్న వేళ నాకు ఈ బర్త్ డే సంబరాలు జరుపుకోవడం ఇష్టం లేదని చెప్పాడు, అయితే ప్రస్తుతం తన టీమ్ తో ఆహారం కరువు ఉన్న ప్రాంతాలను తెలుసుకొని సహాయం చేస్తున్నారని చెప్పాడు . అదేవిధంగా అయన మాట్లాడుతూ ఓ టి టి ఓ మంచి మార్పుగా భావించవచ్చు. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలకు విడుదల కష్టాలు తగ్గుతాయి. పెద్ద చిత్రాలతో పోటీ పడలేక థియేటర్స్ దొరక్క బాధపడేవారికి ఓ టి టి మంచి వేదికగా చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: