దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజా రవాణా అనేది పూర్తిగా ఆగిపోయింది. వేలాది వాహనాలు బయటకు రావడం లేదు. ఇక ప్రైవేట్ కాబ్ సర్వీసులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఓలా వంటి కాబ్ సర్వీసుల్లో పని చేసే డ్రైవర్ లు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి కూడా కొందరికి లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తమను ఆదుకోవాలి అని వాళ్ళు కోరుతున్నారు. 

 

ఇక ఈ తరుణంలో ఓలా సంస్థ తన ఉద్యోగులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. సుమారు 1,400 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఈ ప్రకటన చేసారు. సంస్థకు లాక్ డౌన్ కారణంగా భారీగా ఆదాయం పడిపోయింది అని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: