గత రెండు రోజులుగా పశ్చిమ బెంగాల్, ఓడిస్సా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంఫాన్ తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటింది. పశ్చిమ బెంగాల్ లో అది తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం ఇంకా మూడు నాలుగు గంటల పాటు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 

 

గంట కు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక దీని ప్రభావం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో దీని ప్రభావం కాస్త కనపడింది. బెంగాల్ లో భారీ వర్షాలు ఈదురు గాలులు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: