కరోనా వైరస్ నేపధ్యంలో గత నెల రోజుల నుంచి ఔటర్ రింగ్ రోడ్ పై వాహనాలను అనుమతించడం లేదు అనే సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వాహనాలను అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతి ఇస్తారు. 

 

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక డిజిటల్ పేమెంట్స్ ద్వారానే టోల్ చార్జీలను వసూలు చేస్తారు. వీలైనంత వరకు నగదు రహిత లావాదేవీలను జరుపుకోవాలని హెచ్ఎండిఏ సూచనలు చేసింది. కాగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ పై అడ్డుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: