అంఫాన్ తుఫాన్ ఎట్టకేలకు తీరాన్ని తాకింది. బెంగాల్ లో మరో నాలుగు గంటల పాటు దీని ప్రభావం ఉంటుంది. బెంగాల్ లో నాలుగు గంటల పాటు ఈదురు గాలులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఓడిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేంద్రం హై అలెర్ట్ ప్రకటించింది. అక్కడ భారీ వర్షాలు మరో 24 గంటల పాటు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది అని వాతావరణ శాఖ చెప్తుంది. ఇక కేంద్రం కూడా తమ బృందాలను అక్కడికి పంపింది. మరో రెండు రోజుల పాటు తుఫాన్ ప్రభావం కచ్చితంగా ఉంటుందని కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: