దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రజలకు శాపంగా మారింది.  ఈ నేపథ్యంలో  యావత్ భారత దేశం లాక్ డౌన్ పాటిస్తున్న విషయంత తెలిసిందే.  ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కంటిన్యూ అవుతుంది.  ఈ నెల 31 వరకు ఈ కరోనా కొనసాగుతుందని కేంద్రం  ప్రకటించారు.  ఈ నేథ్యంలో జనసమూహం ఉన్న ప్రదేశాలు మూసి వేసిన విషయం తెలిసిందే.  దాంతో అక్కడ ఉద్యోగస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు . అలాంటి వారిలో దేవస్థానంలో పూజారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలని ఆయన అన్నారు.

ఈ మేరకు ఈ రోజు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఏపిలో పురోహితులు కష్టాల్లో ఉన్నారని.. వారికి భరోసా ఇవ్వాలని అన్నారు. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియజేసిందని ఆయన తెలిపారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో పురోహితులకు నెలకు రూ.5 వేలు, నిత్యావసర సరుకులు అందించాలని ఆయన కోరారు.                  

మరింత సమాచారం తెలుసుకోండి: