ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి గానూ రంగంలోకి దిగి పలు కార్యక్రమాలను చేపడుతుంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఆర్ధికంగా లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేసింది. 

 

రాష్ట్రంలో పాస్టర్ లు, అర్చకులు, ఇమాం, మౌజం, లకు ప్రభుత్వం 5 వేల ఆర్ధిక సాయం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 332 కోట్లను విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్లకు సహాయం చెయ్యాలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: