దేశం లో కరోనా మహమ్మారితో సినీ ప్రపంచం స్థంభించిపోయింది.  ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి.  దాంతో సినీ కార్మికులు కష్టాల పాలయ్యారు.  ఈ సమయంలో చిరంజీవి సి.సి.సి. ట్రస్ట్ స్థాపించి సినీ కార్మికులకు అండగా ఉన్నారు.  ఇప్పటికే పలువురు సినీ నటులు విరాళాలు ఇచ్చారు.  తాజాగా సినీ నటుడు, రాజకీయ నేత శివాజీ తన వంతుగా ఆర్థిక సాయం చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు రూ. 2 లక్షల చెక్ ఇచ్చారు. ఈ సందర్భంగా కార్మికులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన శివాజీని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అభినందించింది. కరోనా కారణంగా సినీ పరిశ్రమ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి.

 

ఇప్పటి వరకు ఎంతో మంది దాతలమ తమ దాతృత్వాన్ని చాటుకున్నారని అన్నారు. ప్రస్తుతం సినీ కార్మికులు కొద్ది మేర కష్టాలు తీర్చామని.. తర్వలో షూటింగులు ప్రారంభం అయితే వారి కష్టాలు దూరం అవుతాయని అన్నారు.    షూటింగులు, ప్రీప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ తదితర పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో, సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు సినీ హీరో, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ శివాజీ ముందుకొచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: