క‌రోనా వైర‌స్ కార‌ణంగా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు ఆగిపోయాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి చాలా దేశాలు లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నాయి. స‌రిహ‌ద్దుల‌ను మూసివేశాయి. అయితే.. క్ర‌మంగా స‌డ‌లింపులు ఇస్తుండ‌డంతో ప్ర‌జార‌వాణా వ్య‌వ‌స్థ‌లు మెల్ల‌మెల్ల‌గా త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే.. అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై న‌మ్మ‌కాన్ని పెంచేందుకు యూఎస్ ఎయిర్‌లైన్స్ సంస్థ‌లు స‌రికొత్త భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించాయి.

 

క‌రోనా వైర‌స్ సోకకుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించాయి. దీంతో నిశ్చింత‌గా విమానాల్లో ప్ర‌యాణించ‌వ‌చ్చున‌ని చెబుతున్నాయి. యూఎస్ క్యారియర్లు జెట్‌బ్లూ ఎయిర్‌వేస్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఈ మేర‌కు ప్ర‌యాణికుల కోసం తీసుకుంటున్న భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: