కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో అనేక రంగాలు కుదేలు అవుతున్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ క్రమంలో తమ తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్న వాళ్లకు జీతాల్లో కోత విధిస్తూ ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా విమానాల ఇంజిన్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారీగా ఉద్యోగులకు స్వస్తి పలికేందుకు రెడీ అవుతోంది.

 

ఈ నేపథ్యంలో తమ కంపెనీలో పనిచేస్తున్న 9 వేల మంది ఉద్యోగులు తొలగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది కంపెనీలో అన్ని దేశాల్లో కలిపి 52 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని కంపెనీ పేర్కొంది. తాజాగా ఉద్యోగులను తొలగించడం ద్వారా ఏడాదికి 856 మిలియన్ డాలర్లు(రూ.6500కోట్లు) భారం త‌గ్గుతుంద‌ని కంపెనీ తెలిపింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: