ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి బస్సులు రోడ్డు ఎక్కాయి. ఇన్ని రోజులుగా డిపోలకు మాత్రమే పరిమితం అయిన బస్సులు ఇప్పుడు రోడ్ల మీదకు అడుగు పెట్టాయి. విజయవాడ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరింది. భారీగా సీట్లను తగ్గించి బస్సులు నడుపుతున్నారు.  దాదాపు 1600 బస్సులు ఇప్పుడు నడుస్తున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. సీటింగ్ లో చాలా వరకు మార్పులు చేసారు. 


కరోనా వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విధంగా ఇప్పుడు మాస్క్ లు, బస్సుల్లో భౌతిక దూరం అనేది చాలా కీలకంగా మారింది. మాస్క్ లేని వాళ్ళను బస్ దింపుతున్నారు అధికారులు. ఇక బస్సుల్లో టికెట్ లు ఇవ్వడం లేదని ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. పరిస్థితి ఆధారంగా బస్సు సర్వీసులను పెంచుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: