చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆ త‌ర్వాత ఈ వైర‌స్ ప్ర‌పంచంలోని మిగిలిన అన్ని దేశాల‌కు విస్త‌రిస్తూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే క‌రోనా ఇప్ప‌ట్లో త‌గ్గే అవ‌కాశాలు కూడా క‌న‌ప‌డ‌డం లేదు. ఇక క‌రోనాను శ‌ర‌వేగంగా క‌ట్ట‌డి చేసిన చైనా అక్క‌డ ఆంక్ష‌లు ఎత్తివేసింది. ప్ర‌జ‌లు అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ర‌వాణా వ్య‌వ‌స్థ కూడా తిరిగి ప్రారంభ‌మైంది. చైనా ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంద‌రూ ఊపిరి పీల్చుకుంటోన్న వేళ చైనాలో మ‌ళ్లీ క‌రోనా అల‌జ‌డి మొద‌లైంది.

 

దీంతో చైనాలో ఇప్పుడు మళ్లీ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కొత్త కేసులు భారీగా న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌భుత్వం దిగిరాక త‌ప్ప‌ని ప‌రిస్థితి. క‌రోనా వైర‌స్ పుట్టిన వుహాన్ న‌గ‌రంలో ప‌దుల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. వుహాన్ నగరంలోనూ కరోనా క్లస్టర్లు వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే జిలిన్ ప్రావిన్స్ లో 34 మందికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాంతో ఆ ప్రావిన్స్ లో మళ్ళీ లాక్ డౌన్ విధించారు. దీంతో అక్క‌డ అన్ని ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌తో పాటు స్కూల్స్ అన్ని మూత‌ప‌డ్డాయి. ఏదేమైనా క‌రోనా మ‌ళ్లీ మొద‌ల‌వ్వ‌డంతో చైనా వాసులు నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: