దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది. లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన నేపధ్యంలో ప్రజలు భారీగా రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఓఖ్లా కూరగాయల మార్కెట్లో కొనుగోళ్లు చేయడానికి వచ్చిన వ్యక్తులకు థర్మామీటర్ గన్ ద్వారా పోలీసులు జ్వరం చెక్ చేస్తున్నారు. 

 

రాజధాని లో కేసులు పెరగడంపై ఇప్పుడు కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అక్కడ కట్టడి చేయకపోతే దేశం పరువు కూడా పోతుంది అని కేంద్రం భావిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ బృందాలు ఇప్పుడు ఢిల్లీ మీద ప్రత్యేక దృష్టి పెట్టాయని సమాచారం. కాగా అక్కడ కరోనా కేసులు 11 వేలు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: