టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు కెరీర్ బిగినింగ్ లో నటుడిగా తర్వాత నిర్మాతగా కొనసాగారు.  ఇక జబర్ధస్త్ కామెడీ షో వచ్చిన తర్వాత జడ్జీగా వ్యవహరించి ఈ మద్య జి తెలుగు లో వస్తున్న అదిరింది షోకి వెళ్లారు.  గత ఏడాది జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.  నటుడిగా, రాజకీయ నేత గా తనదై మార్క్ చాటుకుంటున్నారు నాగబాబు.  ఇక నాగబాబు తన సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పలు కాంట్రవర్సీలకు తెరలేపారు.  ఇదిలా ఉంటే ఈ మద్య ట్విట్టర్ సాక్షిగా అధికార పార్టీ నాయకులపై ద్వజమెత్తిన విషయం తెలిసిందే. 

 

తాజాగా ఆయన గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సే ఒక విధంగా దేశభక్తుడే అని ట్విట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో సోషల్ మీడియాలో ఇది బాగా హాట్ న్యూస్ గా మారిపోయింది.  ఈ నేపథ్యంలో దీనిపై ఆయన వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా మరో ట్వీట్ పెట్టిన ఆయన, తాను చేసే ట్వీట్లకు తనదే బాధ్యతని అన్నారు.
 "నేను ఏమి ట్వీట్ చేసినా, అందులో ఏమున్నా, అది నా వ్యక్తిగత బాధ్యతే. జనసేన పార్టీకిగానీ, మా కుటుంబంలోని మరెవరికైనాగానీ నా అభిప్రాయాలతో ఎటువంటి ప్రమేయమూ లేదు" అని నాగబాబు వ్యాఖ్యానించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: