తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా కుత్భుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో మహింద్రా యూనివర్సిటీ, మెదక్‌ జిల్లా సదాశివ్‌పేట మండలం కంకోల్‌లో వోక్సెన్‌ యూనివర్సిటీ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దూళపల్లి ఏరియా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి. 
 
రంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో అనురాగ్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు 2018లోనే ఆమోదం పొందింది. తాజాగా ప్రభుత్వం యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: