మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ దాడిలో కన్నుమూసి నేటికి 29 ఏళ్లు. 1991వ సంవత్సరం మే నెల 21వ తేదీన రాజీవ్ గాంధీ విశాఖలో జరిగిన ఎన్నికల బహిరంగ సభకు హాజరై అక్కడినుంచి విమానంలో మద్రాసుకు చేరుకున్నారు. అక్కడినుంచి శ్రీపెరంబుదూరు ఎన్నికల సభకు వెళ్లారు. వేదికపైకి వెళ్లే ముందు అందరికీ గౌరవ సూచకంగా నమస్కారాలు పెడుతున్న సమయంలో ఎల్టీటీఈ ఆత్మాహుతి సభ్యురాలు రాజీవ్ గాంధీ కాళ్ళకు మొక్కి, ఆర్‌డీఎక్స్ బెల్ట్ బాంబును పేల్చింది. 
 
వేల సంఖ్యలో ప్రజలు గుమికూడిన చోట రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురి కావడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పర్చింది. ఈ ఆత్మాహుతి దాడిలో రాజీవ్ తో పాటు మరో 26 మంది చనిపోయారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ దుర్మరణం చెందటంతో నాటి నుంచి మే 21ను ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: