ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ చార్జీలు పెరగడంపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉందని ఇలాంటి తరుణంలో విద్యుత్ చార్జీలను ఏ విధంగా పెంచుతారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరుతుంది. టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. 

 

ఇక తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా మరిన్ని విమర్శలు చేసారు ప్రభుత్వంపై. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల వద్ద ఉన్నారు. పని లేదు, వేతనాలు లేవు. అకస్మాత్తుగా, ఏపీ ప్రభుత్వం వారికి తప్పుడు స్లాబ్ వ్యవస్థల ద్వారా కరెంట్ బిల్లు ఇస్తుందని సామాన్యులు చెల్లించగలరా? అని ప్రశ్నించారు చంద్రబాబు. గత 3 నెలల విద్యుత్ బిల్లులను మాఫీ చెయ్యాలని తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: