కరోనా  వైరస్ ను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలలో ఒకటి కర్ణాటక. కర్ణాటక లో ఇప్పటి వరకు కనీసం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1500 కూడా దాటలేదు. కరోనా ను  కట్టడి చేయడంలో కఠిన నిబంధనలు అమలు చేయడంతో అక్కడి ప్రభుత్వం విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు  ఇస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో కూడా రోజు రోజుకు కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా కర్ణాటకలో మొదటిసారి 116 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రస్తుతం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకంగా 116 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

 ఇక 14 మంది డిశ్చార్జి కాగా..   ఇప్పుడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా  కేసుల సంఖ్య 1568 కి చేరింది  కర్ణాటకలో. ఇక ఈ మహమ్మారి వైరస్ బారిన చికిత్స తీసుకుని చాలామంది కోలుకున్నారు. ఇప్పటి వరకు  వైద్యులు 570 మంది పేషెంట్ లను డిశ్చార్జ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: