కరోనా  వైరస్ వ్యాప్తిని  నియంత్రించేందుకు  భారతదేశంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల రవాణా వ్యవస్థను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే పలు ప్రాంతాలకు రైలు మార్గాలు విమాన మార్గాలు బస్సు మార్గాల ద్వారా ప్రయాణించాలి  అనుకున్న ప్రయాణికులకు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే శ్రామిక రైళ్లను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు తమ స్వస్థలాలకు పంపిస్తున్న  విషయం తెలిసిందే. 

 

 ఇక అటు పలు రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సేవలు  కూడా అందుబాటులోకి వచ్చింది ప్రజలకు. అయితే ప్యాసింజర్ రైలు రవాణా ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అని ఎంతోమంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్ రానే వచ్చింది. జూన్ 1 నుంచి 73 ప్యాసింజర్ రైలు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే జూన్ 1 నుంచి అమలు చేయబోయే 73 ప్యాసింజర్ రైళ్లకు  ఏకంగా  290510 మంది ప్రయాణికులకు గాను...149025  టికెట్స్  బుక్ చేయబడ్డాయి అంటూ రైల్వే శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: