ఏపీలో ఇంగ్లీష్ మీడియం విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. హైకోర్టు గత నెలలో ప్రభుత్వం జారీ చేసిన ఇంగ్లీష్ మీడియం జీవోను రద్దు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు జీవోను రద్దు చేయడంతో ఏ మీడియంలో చదవాలని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారో తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గత నెలలో వాలంటీర్ల ద్వారా సర్వే చేయించింది. ఆ సర్వేలో 96 శాతం ప్రజలు ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపారు. 
 
సుప్రీంలో హైకోర్టు తీర్పును సవాల్ చేయాలనే ఉద్దేశంలో సర్కార్ సర్వే చేపట్టింది. అయితే తాజాగా జగన్ మరోసారి ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించేందుకు ఆంగ్ల చానెల్‌కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సమగ్ర శిక్షణా అభియాన్ కింద షార్ట్ ఫిల్మ్‌లతో పాటు సర్వే చేయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: