తనకు తెలియకుండా తన భర్త అంత్యక్రియలను అధికారులు పూర్తి చేయడంపై మంత్రి కేటిఆర్ కి మధుసూదన్ అనే వ్యక్తి భార్య ఫిర్యాదు చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర స్పందించారు. మధుసూదన్ డెడ్ బాడీని అప్పుడు ఫ్రీజ్ చేసే అవకాశం లేదని మంత్రి వివరణ ఇచ్చారు. 

 

మధుసూదన్ మరణ వార్త తట్టుకోలేరు అని వాళ్ళ సన్నిహితులే చెప్పారని ఈటెల వివరించారు. ఇక తాజాగా మధుసూదన్ భార్య, నోడల్ కరోనా ఆఫీసర్ మధ్య సంభాషణ కు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ కూడా దీనిపై స్పందించారు. అయితే దీనిపై తెలంగాణా సర్కార్ విచారణ చేయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తమతో పాటే భర్తను ఇంటికి పంపాలని ఆమె కోరగా నయం కాలేదని ఆఫీసర్ వివరించారు. ఆ తర్వాత భర్త ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించడం వంటివి ఆడియో లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: