తెలంగాణా సిఎం పై పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్‌ అడ్డగోలుగా తిడుతున్నారని, డిక్షనరీలో ఉన్నన్ని తిట్లు తిడుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా టెస్టులు ఎక్కువగా చేయడంలేదని ఆయన మండిపడ్డారు. ప్రతి 10లక్షల మందికి కేవలం 16వేల మందికే టెస్టులు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. 

 

అదే విధంగా తెలంగాణలో ప్రతి 10లక్షల మందికి కేవలం 650మందికే టెస్టులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో టెస్టులు చేయడంలేదని ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణలో రోజుకు 250మందికే కరోనా టెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వలస కూలీల విషయంలో కేసీఆర్‌ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: