సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రొఫైల్ భద్రత కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ వల్ల ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని వ్యక్తులు తమ వ్యక్తిగత వివరాలు చూడకుండా యూజర్లు ప్రొఫైల్ ను లాక్ చేసుకోవచ్చు. రెండు వారాల్లో ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఫేస్ బుక్ ప్రకటన చేసింది. కొత్త ఫీచర్ ను ఎనేబుల్ చేయడం ద్వారా ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని వ్యక్తులు యూజర్ల గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. 
 
ఈ ఫీచర్ తో వ్యక్తిగత వివరాలకు భద్రత పెరుగుతుంది. ఇతరులు యూజర్ల ప్రొఫైల్, కవర్ ఫోటోలను చూడటం సాధ్యం కాదు. ప్రొఫైల్ ను లాక్ చేస్తే ప్రొఫైల్ లాక్డ్ అనే ట్యాగ్ కనిపిస్తుంది. లాక్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ద్వారా ఈ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్ ను తీసుకొస్తున్నట్టు ఫేస్ బుక్ తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్ ను మరింత మెరుగుపరుస్తామని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: