ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని... కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... ఈ నాలుగు జిల్లాల్లో వడగాల్పులతో కూడిన గాలులు వీస్తాయని అన్నారు. 
 
ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని.. 46 నుండి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రలు నమోదయ్యాయని... ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: