ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను ఆదుకుంటామని కీలక ప్రకటన చేశారు. అంఫన్ తాకిడికి ఈ రెండు రాష్ట్రాలు అతలాకుతలయ్యాయని... తాను తుఫాను భీభత్స దృశ్యాలను చూసి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెండు రాష్ట్రాలలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అన్నారు. తాము పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. 
 
కేంద్రం రెండు రాష్ట్రాల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రాష్ట్రాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని డిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో అంఫన్ తుఫాను నిన్న తీరం దాటింది. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. గాలులు, వర్షాలతో ఇళ్లు నేలమట్టం కాగా వందలాది ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: