ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ పడింది.  కరోనాతో ఇండస్ట్రీ షట్ డౌన్ అయ్యింది.. సినీ కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. మరోవైపు సినీ దిగ్గజాలు ఒక్కొక్కరూ మరణిస్తున్నారు.  ప్రముఖ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన మరుసటి రోజే బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూశారు.    అనారోగ్యంతో ఉన్నా ఇర్ఫాన్‌ ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ అభిమానులను పలుకరించేవాడు. ఇర్ఫాన్‌ మరణంతో కోట్లాదిమంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.  క్యాన్సర్ తో పోరాడి వచ్చిన ఇర్ఫాన్ ఖాన్  తల్లి మరణించడం జరిగింది. లాక్ డౌన్ కారణంగా తనకు ఎంతో ఇష్టమైన తల్లిని చూడలేని పరిస్థితి.. దహన సంస్కారం చేయలని పరిస్థితి ఏర్పడింది. 

 

అదే బాధతో ఇర్పాన్ ఖాన్ కన్నుమూశారు.  బాబిల్‌ ఖాన్‌ తన తండ్రి ఇర్ఫాన్‌కు సంబంధించిన మెమొరబుల్‌ ఫొటోలను షేర్‌ చేసుకున్నాడు. ఇర్ఫాన్‌ తలపై టోపీ పెట్టుకుని స్కూల్‌ చిన్నారులను పలుకరిస్తున్న ఫొటోను బాబిల్‌ ఖాన్‌ పోస్ట్‌ చేశాడు. అంతే కాదు తాము ఫామ్ హౌజ్ లో ఉన్న సమయంలో ఏ చిన్న సమయం దొరికినా.. నాన్న స్కూల్‌ పిల్లలు, ప్రిన్సిపాల్‌ ను కలుసుకునేవారని బాబిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇర్ఫాన్‌ ఇంట్లో ఉన్నపుడు తీసిన కొన్ని ఫొటోలను కూడా పోస్ట్‌ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babil Khan (@babil.i.k) on

మరింత సమాచారం తెలుసుకోండి: