వివాదాల దర్శకుడు రామ గోపాల్ వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో  యాక్టీవ్ గా ఉంటాడు. దేశం లో ఏ ఘటన జరిగినా ముందుంటాడు ఆర్జీవీ. అయితే మియా మాల్కోవతో GST సినిమా తీసి యావత్ భారత సినీ అభిమానులను అబ్బురపరచాడు. అయితే ఈయన చేసిన ఈ సినిమా సీన్స్ పై గతంలో విమర్శలు ఎదురయ్యాయి. ప్రస్తుతం కూడా ఆ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయ్. ఆర్జీవీ ఇలాంటి విషయాలను అస్సలు పట్టించుకోడు కాబోలు మళ్లీ ఆమెతోనే సినిమాను మొదలు పెట్టాడు. మరి సినిమా ఏదో కాదులెండి ..క్లైమాక్స్ ..ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఇప్పటికే ఆర్జీవీ రిలీజ్ చేశాడు...

IHG

 

అయితే సినిమా రిలీజ్ డేట్ మటుకు ఇంకా ఫిక్స్ చేయలేదు. అయినప్పటికీ ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో ఈ సినిమాను సినిమా హాళ్లలో రిలీజ్ చేయడం కష్టం కాబట్టి ఈ సినిమాను...తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్ ద్వారా రిలీజ్ చేస్తాను అని తన ట్విట్టర్ త్వర ట్వీట్ చేశాడు...అయితే తాజాగా వర్మ క్లైమాక్స్ సినిమా కి  సంబందించిన  షూటింగ్ లొకేషన్ లో  ఆర్జీవీ, మియా మాల్కోవా   తో కలసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. అయితే ఈ ఫోటో లో వారిద్దరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమా గురించి డిస్కార్షన్ చేస్తున్నాము అని తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫోటో షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు...అయితే మరీ ఇంత డిస్టెన్స్ పాటిస్తే ఎలా వర్మ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు..అదేవిధంగా మరికొందరు మాగొప్ప సోషల్ డిస్టెన్స్ మరీ అంటూ కామెంట్ చేస్తున్నారు ....

 

మరింత సమాచారం తెలుసుకోండి: