గత రెండు మూడు నెలల నుంచి కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కరోనా లాక్ డౌన్ దెబ్బకు ఆదాయం రూపాయి కూడా రావడం లేదు. దానికి తోడు ఇంటి ఖర్చులతో పాటుగా ఎన్నో వేధిస్తున్నాయి. ఇప్పట్లో కుటుంబ ఆర్ధిక వ్యవస్థ బలపడే అవకాశాలు ఏ మాత్రం కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే రిజర్వ్ బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్లకు ఈఎంఐ మారిటోరియం విధించింది. 

 

ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లోన్ కట్టకపోయినా సరే వడ్డీలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మూడు నెలల పాటు వడ్డీలను కూడా లేకుండా మారిటోరియం విధించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ప్రకటన చేసే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: