కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉన్నా సరే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆయన ఎం మాట్లాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది చాలా మందికి అర్ధం కావడం లేదు. ప్రపంచం మొత్తం కరోనా రాకుండా ఉండాలి అంటే మాస్క్ ధరించాలి అని చెప్తుంటే ట్రంప్ మాత్రం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. 

 

చాలా దేశాల అధినేతలు ట్రంప్ మాస్క్ విషయంలో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మిచిగాన్ లోని ఫోర్డ్ కార్ల ఫ్యాక్టరీ ని ట్రంప్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అటార్నీ జనరల్ మాస్క్ పెట్టుకోవాలని ట్రంప్ కి పదే పదే చెప్పారు. మీడియా ముందు మాస్క్ పెట్టుకుని కనపడాలని నేను అనుకోవడం లేదని దయచేసి విసిగించవద్దని కోరడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: