మొన్నటి వరకు కరోనాకు చిన్న పిల్లలు, వృద్దులే ఎక్కువ బలి అవుతున్నారనుకుంటే ఇప్పుడు తాజా అధ్యాయనంలో 30 ఏళ్లలోపు వారేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. కరోనా బారినపడి దేశవ్యాప్తంగా మృతి చెందిన వారిలో 103 మంది 30 ఏళ్లలోపు ఉన్నారని  గణాంకాలు చెబుతున్నాయి. అందులోనూ..  15 ఏళ్లు లోపు వారు 17 మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. కరోనా బారినపడిన వీరు గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో మరణించినట్టు తెలిపింది.   ఇక, నిన్న ఉదయం వరకు దేశంలో 3,435 మరణాలు సంభవించగా, వీరిలో 60 పైబడిన వారు 50.5 శాతం మంది ఉన్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది. కాగా, 45-60 ఏళ్ల మధ్య వయసున్న వారు 1,205 మంది, 30-45 ఏళ్ల లోపువారు 392 మంది, 15-30 ఏళ్ల లోపు ఉన్నవారు 85 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇటీవల ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారిలో 1,734 మంది 60 ఏళ్లు పైబడినవారు కాగా ఇప్పుడు అంతా యువకులు.. చిన్న వయసు వారు అని అంటున్నారు.  మనం ఆరోగ్యంపై ఎంతో శ్రద్ద చూపించాలని.. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. లాక్ డౌన్ పాటించకున్నా.. సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు మెయింటేన్ చేయకున్నా కరోనా వైరస్ కి మూల్యం చెల్లించక తప్పదని ఆరోగ్యశాఖ వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. చనిపోయిన వారిలో 2,198 పురుషులే కావడం గమనార్హం. ఇక, కరోనా మరణాల రేటు ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: