ప్రముఖ మొబైల్ టెలికాం సంస్థ జియో లో పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. జియో లో ఫేస్బుక్ భారీగా పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున ఇతర సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా జియో లో న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కేకేఆర్‌ భారీగా పెట్టుబడి పెట్టింది. 

 

జియోలో రూ. 11,367 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్దమైంది. దీనితో జియో సంస్థలో 2.32 శాతం వాటా సొంతం చేసుకుంటుంది. దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక ప్రకటన చేసింది శుక్రవారం. ఈ పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు, ఎంటర్‌ప్రైజెస్‌ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు చేరనుందని ప్రకటించింది. ఇది కేకేఆర్‌కు ఆసియాలోనే అతి పెద్ద పెట్టుబడి పెడుతుందని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: