జ‌పాన్‌.. ప్ర‌పంచ‌లోని చిన్న‌దేశాల్లో ఒక‌టి..  కానీ.. శాస్త్ర‌సాంకేతిక రంగాల్లో మాత్రం అన్ని దేశాల‌కు అంద‌నంత ఎత్తులో ఉంటుంది. అక్క‌డి నిర్మాణాలు.. ప్ర‌తిదీ ఎంతో కొత్త‌గా నిత్య‌నూత‌న సాంకేతికను సంత‌రింకుని క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా జ‌పాన్ దేశంలో స‌స్పెన్ష‌న్‌ మోనోరైలు ట్రైన్‌ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. త‌ల‌కిందులుగా వెళ్తున్న‌ట్లు అనిపించే అ ట్రైన్ ప్రాజెక్టు ప్ర‌పంచంలో అద్భుత‌మ‌నే చెప్పొచ్చు.

 

ఆ స్థాయిలో ప్రాజెక్టులు చేప‌ట్టాలంటే మిగ‌తా దేశాల‌కు ఇంకా చాలా ఏళ్లే ప‌డుతాయ‌ని చెప్పొచ్చు. జ‌పాన్‌ దేశ పౌరులు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా నిలుస్తారు. అందుకే చేసే ప‌నిలో ఎంతో అంకిత‌భావం ప్ర‌ద‌ర్శిస్తూ కొత్త‌ద‌నాన్ని సృష్టిస్తారు. అందుకే జ‌పానీయుల ఆలోచ‌నా విధానం ఎవ్వ‌రికీ అంత సుల‌భంగా అంతుచిక్క‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: