దేశంలో లాక్ డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి మీడియా ముందుకొచ్చారు. గడచిన రెండు నెలల వ్యవధిలో మూడోసారి ఆర్బీఐ గవర్నర్ మీడియా ముందుకు వచ్చారు. ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ మరోసారి వడ్డీరేట్లు తగ్గించినట్టు ప్రకటించారు. ఆర్థిక రంగ అభివృద్ధికి మరికొన్ని చర్యలు చెపడుతున్నట్టు తెలిపారు. రెపోరేటు 4.40 శాతం నుంచి శాతానికి తగ్గించినట్టు తెలిపారు. 
 
లాక్ డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని చెప్పారు. బ్యాంకుల్లో నగదుకు కొత్త నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు. అతి త్వరలో బ్యాంకుల్లో కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని అన్నారు. మార్చిలో పారిశ్రామికోత్పత్తి 17 శాతం తగ్గిందని తెలిపారు. లాక్ డౌన్ దేశంపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: