కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం బాగా దెబ్బ తిన్నట్టు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ ప్రకటించారు. మీడియా తో మాట్లాడిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం 13 నుంచి 32 శాతం వరకు తగ్గిందని ఆయన పేర్కొన్నారు. 

 

ఈ విషయాన్ని wt౦ ప్రకటించింది అని ఆయన గుర్తు చేసారు. మార్చ్ లో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం పడిపోయిందని అన్నారు. 37 శాతం ఆహార ఉత్పత్తులు పెరిగాయని చెప్పారు ఆయన. ఆర్ధిక వృద్ది రేటు పెంచే విధంగా తాము చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుందని ఆయన వివరించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: