ద్రవ్యోల్భణం అంచనా వేయడం చాలా కష్టంగా మారిందని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. కాసేపటి క్రితం మీడియా తో మాట్లాడిన ఆయన... దేశంలో ఆహార భద్రత ఉందని వివరించారు. ఏప్రిల్లో ఏకంగా 8.6 శాతానికి పైగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి బాగా పెరిగిందని చెప్పారు. 

 

దేశంలో ఆహార ఉత్పత్తులు ఎక్కువగా పెరిగాయని పేర్కొన్నారు. 3.7 శాతం పెరిగాయని పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గింది అని చెప్పారు. వ్యవసాయ రంగం పటిష్టంగా ఉందని లాక్ డౌన్ నిబంధనల ఆధారంగా ద్రవ్యోల్భణం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: