కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత మొదటిసారి ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా  వైరస్ కారణంగా దేశంలో ఏర్పడిన పరిస్థితుల గురించి సవివరంగా తెలిపారు ఆర్.బి.ఐ గవర్నర్. అంతే కాకుండా భారత వృద్ధిరేటు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే విషయంపై కూడా చెప్పుకొచ్చారు. 

 

 అయితే కరోనా  వైరస్ ప్రభావం పారిశ్రామిక రంగంపై భారీగానే పడిందని ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పుకొచ్చారు. ఏకంగా మార్చి నెలలోనే 17 శాతం పారిశ్రామిక రంగం కుదేలైంది అంటూ చెప్పుకొచ్చారు ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో కూడా ఉత్పత్తి రంగంలో ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: