దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంపై భారీగా ప్రభావం చూపించింది. దేశంలో ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు. ప్రజలకు ఉపాధి లేకపోవడమే కాకుండా కంపెనీలు కూడా నడిచే పరిస్థితి లేదు. 

 

ఈ నేపధ్యంలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తి కాంత దాస్ కీలక ప్రకటన చేసారు. ప్రభుత్వం ఆదాయం భారీగా పడిపోయిందని ఏ రంగం నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థ కష్టాల్లో ఉందని అందుకే కొన్ని కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. గత నెలలో ఆర్ధికంగా చాలా వరకు నష్టపోయినట్టు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: