లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిందని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు నగదు ఎక్కువగా వాడేందుకు గానూ చర్యలు తీసుకుంటున్నాం అని ప్రకటించారు. ఇక ఆర్ధిక వృద్ది మీద తమకు ఏ విధంగా ఈ ఏడాది నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. 

 

ప్రస్తుతం దేశ భవిష్యత్తు లాక్ డౌన్ కొనసాగింపు మీద ఆధార పడి ఉందని చెప్పారు ఆయన. ఈ ఏడాది ఎన్నో రంగాలు కుప్ప కూలిపోయాయి అని చెప్పుకొచ్చారు. ఇక లోన్ల మారిటోరియం కూడా ఆయన పెంచుతున్నట్టు ప్రకటించారు. నాలుగు కేటగిరీలుగా ఆర్ధిక వ్యవస్థను పెంచుతున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆర్ధిక వ్యవస్థను అంచనా వేయడం చాలా కష్టంగా మారిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: