ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈరోజు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ రెపో రేటును 4.4 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గిస్తూ మరో ట్విస్ట్ ఇచ్చారు. లాక్ డౌన్ వల్ల సిమెంట్, ఉక్కు పరిశ్రమల్లో కొనుగోళ్లు తగ్గాయని... ఈ రంగాలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. తయారీ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ లో క్షీణించిందని కెప్పారు. 
 
టర్మ్ లోన్లపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగిస్తామని అన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగిందని వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. రుతుపవనాలు ఈ సంవత్సరం సాధారణంగానే ఉంటాయని తెలిపారు. డాలర్ తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: