ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు పంచాయితీ కార్యాలయాలకు ప్రభుత్వ రంగులు వేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం గత రెండు మూడు నెలల నుంచి కోర్ట్ లో నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు మరో రంగు అదనంగా వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 

 

ఈ జీవో ని రాష్ట్ర హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ప్రభుత్వం సుప్రీం కోర్ట్, హైకోర్ట్ నిబంధనలను పాటించలేదని కోర్ట్ ఈ కేసుని సుమోతో గా తీసుకుంది. పార్టీ రంగులు తాము వేయలేదు అని ప్రభుత్వం చెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని పంచాయితీ కార్యదర్శికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి హైకోర్ట్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. తాజాగా దీనిపై విచారణ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: